సేవ చెయ్యడమే మా ప్రధమ లక్ష్యం
మేము "శ్రీ వైఖానస నెట్‌వర్క్" అనే పేరుతో ఒక ఆన్‌లైన్ వేదికను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి చొరవ తీసుకుంటున్న వైఖానస కమ్యూనిటీకి చెందిన సభ్యులము.
ఈ వేదిక యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వైఖానస సభ్యులకు సాధ్యమైనంత మేర సేవలను ఈ ఆన్‌లైన్ వేదిక ద్వారా అంధించటమే.
మిషన్
భాష మరియు ప్రాంతీయతలకు అతీతంగా మన వైఖానస సమాజానికి సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ శ్రీ వైఖానస నెట్‌వర్క్ ముందుగా గుర్తుకు వచ్చే ఒక వేదికగా ఉంటుంది. ముఖ్యంగా మన వైఖానస అర్చక సభ్యులకు చేతనైనంత సహాయ సహకారాలు అందించడానికి తోడ్పడుతుంది.
విజన్
శ్రీ వైఖానస నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక వైఖానస సంఘములతో కలిసి సమన్వయంతో పని చెయ్యడానికి చాలా ఉత్సాహంగా ఉంది
&
మన వైఖానస సమాజానికి నిస్వార్థతతో సేవ చేయాలనే మన మిషన్ కోసం మనమందరం ఏకతాటిపై నడుద్దాం.
విలువలు
మనమంతా ఒకటే: వైఖానస సభ్యులందరు ఇది మన ఉమ్మడి కుటుంబం అని భావించేలా సానుకూల వాతావరణాన్ని కల్పించటానికి మేము కట్టుబడి ఉన్నాము.
పారదర్శకత & జవాబుదారీ: మేము చేసే ప్రతి పనిలోను నిజాయితీ మరియు పారదర్శకతకు కట్టుబడి ఉన్నాము.
గౌరవం: ప్రతి వైఖానస సభ్యునితో గౌరవంగా వ్యవహరిస్తాము. మేము ప్రతి ఒక్కరి భావాలు, విలువలు మరియు దృక్కోణాలను పరిగణనలోకి తీసుకుంటాము.
సేవ: సేవ చెయ్యడమే మా ప్రధమ లక్ష్యం. సేవా స్ఫూర్తితో, మేము మా సమయాన్ని, శక్తిని మరియు వనరులను ఉచితంగా అందజేస్తాము.
సమిష్టిగా సాధిద్దాం: మేము ఒక బృందంగా పని చేస్తాము. వ్యక్తిగతంగా కంటే సమిష్టిగా సాధిస్తాము. మన వైఖానస సమాజానికి సేవ చేయాలనే మా మిషన్‌ను సాధించడానికి మా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఉత్తమ పనితీరును ప్రదర్శించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
మేము మీ మద్దతు కోరుకుంటున్నాము
మన స్వంత ఆన్లయిన్ వేదికని నిర్మించి మన యావత్ వైఖానస కుటుంబానికి అందించే పనిలో మేము నిమగ్నమై ఉన్నాము.
అందులో భాగంగా, మేము మీ నుండి హృదయ పూర్వక అభిప్రాయాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ అభిప్రాయాన్ని అందించడానికి దిగువ బటన్‌పై క్లిక్ చేయండి.
ధన్యవాదములు